హైదరాబాద్: హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో టెక్ మహీంద్రా, మహీంద్రా యూనివర్సిటీ సంయుక్తంగా గురువారం 'జీసీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కాంక్లేవ్-2026'ను నిర్వహించాయి.
ఈ సదస్సుకు ప్రిన్సిపల్, సిటిజన్స్ బ్యాంక్, డీబీఎస్ టెక్ ఇండియా, ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ జీసీసీ, అష్యూరంట్ తదితర ప్రముఖ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ (BFSI) గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (GCC) సీనియర్ నాయకులు హాజరయ్యారు.
భవిష్యత్ జీసీసీ అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు, ఇంటర్న్‌షిప్‌లు, ప్లేస్‌మెంట్ల కోసం మహీంద్రా యూనివర్సిటీ తన ఫైనాన్స్ రీసెర్చ్ ల్యాబ్, బెస్ట్-ఎంయూ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్, మేకర్స్ ల్యాబ్ సదుపాయాలను పరిశ్రమ ప్రతినిధులకు ప్రదర్శించింది.
టెక్ మహీంద్రా అమెరికాస్ బీఎఫ్‌ఎస్‌ఐ హెడ్ రోషన్ శెట్టి, మహీంద్రా యూనివర్సిటీ వీసీ డాక్టర్ యజులు మేడూరి, సిటిజన్స్ బ్యాంక్ టెక్నాలజీ డైరెక్టర్ సుదీప్ ముఖోపాధ్యాయ, ప్రిన్సిపల్ ఇంజనీరింగ్ డైరెక్టర్ అమల్‌కిరణ్ పాట్కర్ తదితరులు ప్రసంగించారు.




