విజయవాడ: తెలుగు స్వాగ్ ట్రోఫీ వాలీబాల్ ప్రదర్శన మ్యాచ్‌లో తెలుగు బ్లాక్‌హాక్స్ జట్టు విజేతగా నిలిచింది. గురువారం వీఆర్ సిద్ధార్థ విశ్వవిద్యాలయంలో జరిగిన పోరులో బ్లాక్‌హాక్స్ అకాడమీ జట్టుపై 5-0తో గెలిచింది. ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ఫ్రాంచైజీ అయిన బ్లాక్‌హాక్స్‌ను కంకణాల స్పోర్ట్స్ గ్రూప్ (కేఎస్‌జీ) నిర్వహిస్తోంది.
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) వీసీ అండ్ ఎండీ ఎస్. భరణి, కేఎస్‌జీ చైర్మన్ కె. అభిషేక్‌రెడ్డి సమక్షంలో విజేతలకు ట్రోఫీ అందజేశారు.
పీవీఎల్ జట్టులో ఐదుగురు
- సిరిల్ రెడ్డి (వరంగల్)
- విష్ణువర్ధన్ బాబు (యానాం)
- నమిత్, మునీష్ వెంకటేశన్, దీపక్
ఆగస్టులో విజయవాడలో నిర్వహించిన ట్రయల్స్ ద్వారా వీరు పీవీఎల్ సీజన్-5 జట్టుకు ఎంపికయ్యారు. ట్రయల్స్‌కు వచ్చిన మరో 12 మంది బ్లాక్‌హాక్స్ అకాడమీ తరఫున ఆడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారని అభిషేక్‌రెడ్డి అన్నారు. పీవీఎల్ సీజన్-5 ఈ నెల 30న అహ్మదాబాద్‌లో ప్రారంభం కానుంది.




