లక్నో: సయ్యద్‌ మోదీ ఇండియా ఇంటర్నేషనల్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్లు గాయత్రి గోపీచంద్‌–ట్రీసా జాలీ జోడీ క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం బాబు బనారసి దాస్ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ప్రీ-క్వార్టర్స్‌లో భారత జంట శ్రేయా బాలాజీ–ప్రణవి నటరాజన్‌పై 21-9, 21-8 తేడాతో వరుస గేమ్‌లలో గెలిచింది.

2024, 2025 టైటిళ్లను గెలుచుకున్న గాయత్రి–ట్రీసా జోడీ, శుక్రవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్‌ ఆడుతూ హ్యాట్రిక్‌ టైటిల్‌ వేటను కొనసాగించనుంది. $2,50,000 ప్రైజ్‌మనీతో ఈ టోర్నీ నవంబర్‌ 24 నుంచి 29 వరకు జరుగుతోంది.

మరోవైపు, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తెలుగు ఆటగాడు సాత్విక్‌ రెడ్డి కనపురం–రేషిక ఉదయసూరియన్‌ జోడీ 22-20, 21-23, 21-14తో ఆయుష్‌ మఖీజా–అనఘా అరవింద పైపై గెలిచి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది.

అయితే ఏడో సీడ్‌ కె. మనీషా–ధ్రువ్‌ రావత్‌ జోడీ 16-21, 15-21తో ఇండోనేషియా జంట చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.