హైదరాబాద్: ఫార్మా సంస్థ కోహాన్స్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్ (గతంలో సువెన్ ఫార్మాస్యూటికల్స్) శంషాబాద్‌లోని తన ఫార్ములేషన్ తయారీ కేంద్రానికి సంబంధించి కీలక నియంత్రణ అప్‌డేట్‌ను శనివారం ప్రకటించింది. తెలంగాణలోని శంషాబాద్ ప్లాంట్ (FEI నం. 3019037664) తనిఖీని అమెరికా ఎఫ్‌డీఏ (USFDA) పూర్తి చేసి, ఎస్టాబ్లిష్‌మెంట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్ (EIR) జారీ చేసినట్లు ఎక్స్ఛేంజీలకు తెలిపింది.
ఈ తనిఖీ ఫలితాన్ని USFDA 'వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్' (VAI)గా వర్గీకరించింది. EIR అందినందున ఈ తనిఖీ ప్రక్రియ అధికారికంగా ముగిసిందని కంపెనీ సెక్రటరీ శిశిర్ కె. మిశ్రా బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొన్నారు.
USFDA నిబంధనల ప్రకారం, VAI క్లాసిఫికేషన్ అంటే తనిఖీలో కొన్ని స్వల్ప అంశాలను గుర్తించినప్పటికీ, కఠిన నియంత్రణ చర్యలు లేదా దిగుమతి ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని, సంస్థ స్వచ్ఛందంగా వాటిని సరిదిద్దుకోవచ్చని అర్థం.
సెప్టెంబర్ 5, 2026న శంషాబాద్ యూనిట్‌లో USFDA తనిఖీ ప్రారంభమైనట్లు కంపెనీ తొలుత వెల్లడించింది. శుక్రవారం (నవంబర్ 20) ఎన్‌ఎస్‌ఈలో కోహాన్స్ లైఫ్‌సైన్సెస్ షేరు 0.62 శాతం లాభపడి ₹462.30 వద్ద ముగిసింది.




