హైదరాబాద్: శాస్త్రీయ నృత్య కళాకారులను ఒకే వేదికపైకి తెచ్చే నాలుగో 'హైదరాబాద్ ఒడిస్సీ ఉత్సవ్ 2026' ఆదివారం (నవంబర్ 22) హైటెక్ సిటీలోని శిల్పారామం యాంఫీథియేటర్‌లో జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఈ నృత్యోత్సవం కొనసాగుతుందని నిర్వాహకులు శనివారం ప్రకటించారు.
హైదరాబాద్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఒడిస్సీ నృత్య కళాకారులు, విద్యార్థులు, గురువులు, నాట్య సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ ఉత్సవం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకురాలు ప్రీతి మహాపాత్ర తెలిపారు.
ఈ ఉత్సవంలో సోలో (Solo), డ్యూయెట్ (Duet), ట్రియో (Trio) అనే మూడు విభాగాల్లో ప్రదర్శనలు ఉంటాయని ఆమె వివరించారు. హైదరాబాద్ నుంచి ఏటా దాదాపు 80 మందికి పైగా నృత్యకారులు ఇందులో పాల్గొంటున్నారని చెప్పారు.
వివిధ ఒడిస్సీ నాట్య పాఠశాలల మధ్య కళాత్మక మార్పిడి, పరస్పర ప్రోత్సాహం పెంపొందించడానికి ఇది చక్కని వేదికని ప్రీతి మహాపాత్ర పేర్కొన్నారు. ఈ ఏడాది వేడుకకు రాష్ట్ర వెలుపలి నుంచి ఒక ప్రముఖ ఒడిస్సీ కళాకారుడు ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు.




