హైదరాబాద్: నగరంలోని పురాతన మెట్ల బావుల వారసత్వాన్ని సమకాలీన కళతో అనుసంధానించే 'బావోలి ఆర్ట్ సంగం' (Baoli Art Sangam) బినాలే డిసెంబర్ 1న ప్రారంభం కానుంది. దేశంలోనే తొలి స్టెప్వెల్ ఆర్ట్ బినాలేగా 40 రోజుల పాటు (డిసెంబర్ 1, 2026 నుంచి జనవరి 10, 2027 వరకు) ఈ ఉత్సవం కొనసాగుతుంది.
12 చారిత్రక వేదికలు, 200 మంది కళాకారులు
రాష్ట్రపతి నిలయం, మహ్ లకా బాయి, బన్సీలాల్పేట (17వ శతాబ్దం నాటి 6 అంతస్తుల మెట్ల బావి), ఆదిక్మెట్, బ్రిటిష్ రెసిడెన్సీ, సాలార్ జంగ్, ఫలక్నుమా ప్యాలెస్ బస్ డిపో, సీతారాంబాగ్, బాపూ ఘాట్, గోల్కొండ, మంచిరేవుల, అమ్మపల్లి సహా 12 చారిత్రక ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆరుగురు అంతర్జాతీయ కళాకారులతో సహా మొత్తం 200 మంది కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. డిసెంబర్ నెలలోనే 24 రోజుల పాటు 77 కార్యక్రమాలు షెడ్యూల్ చేశారు.
నిర్వాహకులు, ప్రారంభోత్సవం
'ఏక్చిత్ర' (అన్నపూర్ణ మడిపడిగ), 'ది రెయిన్వాటర్ ప్రాజెక్ట్' (కల్పనా రమేష్) సంయుక్తంగా, కల్చర్ అండ్ హెరిటేజ్ ఛైర్పర్సన్ అల్లు స్నేహారెడ్డి నేతృత్వంలో దీన్ని నిర్వహిస్తున్నాయి. తెలంగాణలో సుమారు 600 మెట్ల బావులు ఉన్నాయి. డిసెంబర్ 1న సాయంత్రం 5 గంటలకు గోల్కొండలో ప్రారంభ సెషన్, పుస్తకావిష్కరణతో వేడుక మొదలవుతుంది.




