శంషాబాద్: త్రిదండి చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవం ‘యతీంద్ర సప్తతి’ వేడుకలు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో ముగిశాయి. ఐదు రోజుల పాటు జరిగిన ఉత్సవాల చివరి రోజు శ్రీకోదండ రామచంద్ర స్వామికి 1,001 కలశాలతో ఏకోత్తర సహస్ర కలశాభిషేకం నిర్వహించారు.

ఉత్సవాల్లో భాగంగా 10 వేల మందికి పైగా భక్తులు ఒకేసారి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి ధ్రువపత్రం అందజేశారు.

వేడుకల విశేషాలు

  • వివిధ రంగాల్లో సేవ చేసిన 70 మందికి సమతా పురస్కారాలు
  • సేవకే జీవితం అంకితం చేసిన 70 మంది మాతృమూర్తులకు సత్కారం
  • స్వామి చేతుల మీదుగా ‘తిరుప్పావై’ పుస్తకావిష్కరణ

శ్రీరామనగరంలో ఇది 33వ సహస్ర కలశాభిషేకమని నిర్వాహకులు ముందుగానే ప్రకటించారు.