విజయవాడ: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు విజయవాడ ముస్తాబవుతోంది. నవంబర్ 14 నుంచి 20 వరకు ఎంజీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో వారం రోజుల పాటు కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల కరపత్రాన్ని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ గురువారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. గ్రంథాలయాధికారి కె. రమాదేవి పాల్గొన్నారు.
రోజువారీ కార్యక్రమాలు
- నవంబర్ 14: బాలల దినోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన; విద్యార్థులకు ఫ్యాన్సీ డ్రెస్, క్రాఫ్ట్ పోటీలు
- నవంబర్ 15: ఉదయం 10కి పుస్తక ప్రదర్శన, 11కి చదరంగం పోటీలు; సాయంత్రం 5కు కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘తెలుగు వాడకమే తెలుగుకు వెలుగు’ అంశంపై కవి సమ్మేళనం
- నవంబర్ 16: పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు
- నవంబర్ 17: గ్రంథాలయ ఉద్యమ నేతలపై ప్రసంగం; ‘చదువుతో నేర్చుకో – నేర్చుకుని నడిపించు’ అంశంపై సదస్సు
- నవంబర్ 18: మ్యూజికల్ చైర్స్, దేశభక్తి గీతాల పోటీలు; జ్ఞానజ్యోతి పురస్కారాల ప్రదానం
- నవంబర్ 19: మహిళలకు ప్రత్యేక పోటీలు; సాయంత్రం బెజవాడ యువ కళలు రజతోత్సవం
- నవంబర్ 20: ముగింపు వేడుకలు
నవంబర్ 17న రస భారతి ఆధ్వర్యంలో ప్రత్యేక సాహిత్య కార్యక్రమం, నవంబర్ 18న గోల్కొండ మంగతాయారు స్మారక సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో బాల, యువ కవి సమ్మేళనం కూడా ఉంటాయి.




